పార్టీలు మారుతున్నారు
ఎమ్మెల్యేలు మారుతున్నారు
వేములపల్లి మండలానికి శాపం గా మారిన చైర్మన్ పదవి
వేములపల్లి( ప్రజాలహరి) ఎంతోమంది ఎన్నో పార్టీలలో మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఏది మారిన వేములపల్లి మండలం ప్రజల రాత మాత్రం మారుతలేదు. పూర్తి వివరాలు కెళ్తే సుమారుగా గత 50 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఒకే ఒక మార్కెట్ ఉన్నది, అట్టి మార్కెట్ ధను మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ఉన్నటువంటి ఉమ్మడి మండలాలు దామరచర్ల, వేములపల్లి, మిర్యాలగూడ ఈ మూడు మండలాల ప్రజలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ పదవికి అర్హులు, అందులో భాగంగా వేములపల్లి మండలం ప్రజల శాపమా లేక ఈ మండలానికి ఉన్నటువంటి దోషమా, మార్కెట్ ఏర్పడినట్లు నుంచి దామరచర్ల, మిర్యాలగూడ మండల ప్రజలు మాత్రమే చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యేలు వారి వారి పార్టీ అభ్యర్థులను ఆయా మండలాల వారికి మాత్రమే చైర్మన్ పదవులు ఇవ్వడం జరుగుతుంది. గత తొమ్మిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి దామచర్ల, మిర్యాలగూడ మండలాల ప్రజలకు చైర్మన్ పదవి వరించింది. ప్రస్తుతం 9 సంవత్సరాల తర్వాత మళ్లీ మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ పదవికి ప్రభుత్వ రిజర్వేషన్ ప్రకారం జనరల్ మహిళగా వచ్చింది. దీంతో వేములపల్లి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈసారైనా వేములపల్లి మండల ప్రజలకు చైర్మన్ పదవిని కట్టబెట్టాలని పలు గ్రామాల ప్రజలు స్థానిక శాసనసభ్యులకు మొర పెట్టుకోవడం జరుగుతుంది, దీంతో స్థానిక శాసనసభ్యులు పలు విధాలుగా ఆలోచన చేస్తున్నారు ఏది ఏమైనప్పటికిని వేములపల్లి మండల ప్రజలు మాత్రం ఈసారి మార్కెట్ చైర్మన్ పదవి వేములపల్లి మండలంలోని ఏ గ్రామంలోనైనా వ్యక్తికి చైర్మన్ చేసినట్లయితే బాగుంటుందని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈసారి వేములపల్లి మండలానికి సంబంధించినటువంటి వ్యక్తిని మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ పదవి వస్తుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నా వేములపల్లి మండలానికి తగ్గని మార్కెట్ చైర్మమన్.