సేవలాల్ ఆశయాలే గిరిజనులకు స్ఫూర్తి:-
మిర్యాలగూడ ప్రజాలహరి …….. సంత్ సేవలాల్ ఆశయాలే గిరిజనులకు యువతకు స్ఫూర్తి అని మిర్యాలగూడ ఏంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి,ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ లు అన్నారు. సంత్ సేవలాల్ 285వ జయంతి వేడుకలు శనివారం మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సేవలాల్ మార్గం అందరికీ అచరణియమని చెప్పారు.అహింస మార్గాన్ని సూచించిన శాంతి పరస్పర సహాకారం కోసం కృషీ చేశారని అన్నారు.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనీ అనాడే చెప్పిన గొప్ప మనిషి అని పేర్కొన్నారు.ప్రతి తండాలు ,మారుమూల గూడెంలలో వారీ ఆశయాలను తీసుకపోవాలని చెప్పారు.ప్రభుత్వం గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే సంత్ సేవలాల్ జయంతి వేడుకలకు అదనంగా మరో రూ.కోటి మంజూరు చేసిందని గుర్తు చేశారు.ప్రభుత్వ విప్ పదవి గిరిజనులకు ఇచ్చి ప్రాధాన్యత కల్పించారని తెపారు.మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి క్యాంప్ లోని బంజారా భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.బంజారా మహిళల వేషధారణ,కోలాటం, డప్పు వాయిద్యాలు పలువురిని ఆకట్టుకున్నారు.అనంతరం రమేష్ మాహా రాజ్ మహాబోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, డిసిసి అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దీరవత్ స్కైలాబ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,రతన్ సింగ్ నాయక్, ఎంపీపీ నందిని రవితేజ,త్రిపురరాం జెడ్పీటిసి భారతి భాస్కర్ నాయక్,శ్రీనివాస్, కృష్ణయ్య, నాగు నాయక్, సిద్దు నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోథ్ దశరథ్ నాయక్, నాగరాజు నాయక్, మాన్య నాయక్,రవి నాయక్, మాంగ్య నాయక్,చక్రి నాయక్,అశోక్ నాయక్, సీతారాం నాయక్, నెహ్రూ నాయక్, తదితరులు పాల్గొన్నారు.