యాదాద్రి పవర్ ప్లాంట్ ను శరవేగంగా పూర్తి చేయాలి మంత్రులు ప్రకటన..
మిర్యాలగూడ ప్రజాలహరి నల్గొండ జిల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రహదారులు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. వీరు ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో .బేగంపేట్ నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ కు చేరుకున్నారు అక్కడ విద్యుత్ అధికారులు ఘన స్వాగతం పలికారు .ముందుగా యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు ఆలస్యం జరగకుండా నాణ్యతతో చేయాలని చెప్పారు సాధ్యమైనంత త్వరలో ప్లాంటు లో విద్యుత్ జనరేషన్ ప్రారంభం కావాలని కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. ప్లాంట్ పరిశీలన అంతరం గెస్ట్ హౌస్ లో విద్యుత్ అధికారులు ట్రాన్స్కో సి ఎం డి రిజ్వి, జిల్లా కలెక్టర్ దీప్తి చందన, ఎస్పీ, యాదాద్రి పవర్ ప్లాంట్ ఎస్సీ తో డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశం నిర్వహించారు. అధికారులకు వాళ్ళు సూచనలు చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఉప ముఖ్యమంత్రి ,మంత్రులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కాంగ్రెస్ నాయకులు రామలింగయ్య వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు