Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడలో త్వరలో పివి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. బ్రాహ్మణ సంఘ నాయకులు

Post top
home side top

మిర్యాలగూడలో భారతదేశ మాజీ ప్రధాని మంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు విగ్రహం త్వరలో ఏర్పాటు చేస్తాం ముక్తకంఠంగా ప్రకటించిన వక్తలు……. మిర్యాలగూడ ప్రజాలహరి….

భారతదేశానికి పీవీ నరసింహారావు చేసిన సేవలు శల్గానీయమని ఆయన సేవలను గుర్తు ఉండేలా మిర్యాలగూడ పట్టణంలో ఆయన విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని మిర్యాలగూడ బ్రాహ్మణ పరిషత్ మరియు మిర్యాలగూడ నియోజకవర్గ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ముక్తకంఠంగా ప్రకటించారు. ఈరోజు సాయంత్రం స్థానిక విగ్నేశ్వర ఆలయంలో జరిగిన పీవీ నరసింహారావు స్మృతంజలి సభలో పలువురు బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ బ్రాహ్మణ వెల్ఫేర్ ప్రొఫెషనల్ కమిటీ గౌరవ సలహాదారుడు వెంకటేశ్వరరావు ,పులి కృష్ణమూర్తిలు సభ అధ్యక్షులుగా వ్యవహరించారు. సందర్భంగా పీవీ నరసింహారావు చేసిన సంస్కరణల వల్ల భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఐదో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు .గొప్ప మానవతావాది ఆయన జాతీయ ఉద్యమంలో కొప్పోలు వెంకటేశ్వరరావు అన్నారు. బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ కమిటీ జిల్లా అధ్యక్షులు మురళీ శర్మ మాట్లాడుతూ తెలుగు వారందరూ గర్వ పడ్డ వ్యక్తి నరసింహ రావు అని చెప్పారు. మిర్యాలగూడ బ్రాహ్మణ అఫీషియల్ ఫ్రెండ్ ప్రొఫెషనల్ కమిటీ అధ్యక్షులు వెంకటరమణారావు మాట్లాడుతూ పివి నరసింహారావు రత్న భారతరత్న ఇవ్వటం గర్వించదగ్గ విషయం అన్నారు . బోయినపల్లి భుజంగరావు మాట్లాడుతూ ఈరోజు భారతదేశ నడుస్తుందంటే ఆయన చేసిన సంస్కరణ లే కారణమన్నారు. సీనియర్ అడ్వకేట్ టీ మల్లికార్జునరావు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు అని అన్నారు. గౌరవ సలహాదారుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి అయిన ఏనాడు బేశ్జాలకు వెళ్లలేదని చెప్పారు. అడ్వకేట్ రఘురాం రావు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పివీ అని అన్నారు. బ్రాహ్మణ సంఘం సీనియర్ సభ్యులు చెన్నూరు రంగారావు మాట్లాడుతూ ఆయన తీసుకొచ్చిన భూసంస్కరణాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. పి వీ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టి రామ రంగారావు మాట్లాడుతూ ఇవి నరసింహారావు గారు లా చేసిన యూనివర్సిటీ లో తాను లా చేయడం నాకు గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. చిట్యాల వెంకటరమణ మాట్లాడుతూ ఢిల్లీలో పి వీ జ్ఞాపకార్థం జ్ఞానభూమి ఏర్పాటు చేయాలని కోరారు .సీనియర్ ప్రజాలహరి ఎడిటర్ చిట్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మిర్యాలగూడ పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభాముఖంగా కోరారు .వారి విజ్ఞప్తికి కమిటీ వారు స్పందిస్తూ సాధ్యమైన త్వరలో పి వి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ వేసి ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినాయక స్వామి సేవా సమితి గౌర అధ్యక్షులు కేఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ పివి నరసింహారావు సాహిత్యoపై మక్కువ ఎక్కువ అని అన్నారు. ఉపాధ్యాయుడు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ  పి వి రాజకీయ ప్రస్థానం, ఆయన సంస్కరణలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ సభ్యులు కుర్మిటి రాధాకృష్ణ, జగదీష్, పుల్లాబట్ల లక్ష్మీనరసింహ శర్మ, సుజిత తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.