*పోరాట స్ఫూర్తిని సేవ రూపంలో కొనసాగించడం అభినందనీయం*
మిర్యాలగూడ ప్రజాలహరి
*కామ్రేడ్ నంద్యాల శ్రీనివాస రెడ్డి గారి పోరాట స్ఫూర్తిని వారి కుమారులు నంద్యాల వేణుధర్ రెడ్డి, నంద్యాల కృపాకర్ రెడ్డి సేవ రూపంలో కొనసాగించడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు పేర్కొన్నారు*
*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గారి ఐదో వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర నగర్ లో వారి కుమారులు డాక్టర్లుగా కొనసాగుతున్నటువంటి NSR గారి మనుమరాళ్ళైనా డాక్టర్ నంద్యాల చరిత గారు, డాక్టర్ నంద్యాల సృజన గార్ల సహకారం తో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది*ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించి
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతూ కామ్రేడ్ NSR గారు సాయుధ పోరాటం లో రాజీలేని పోరాటం నిర్వహించి జైళ్ళ జీవితం గడిపి తిరిగి వచ్చి మల్లి అదే ప్రజల కోసం జరిగిన ప్రజా పోరాటం లో పాల్గొని శాసనసభ్యులు గా ఎన్నికై నల్గొండ జిల్లా ప్రజానీకం ఎదురుకుంటున్న సమస్యలను అసెంబ్లీ లో లేవనేత్తి వాటి పరిష్కారం కోసం నాటి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి వాటిని సాధించిన తీరు ప్రజా పోరాటాలు నిర్వహించే వారికీ ఆదర్శం అని వారు పేర్కొన్నారు. వారి కుమారులు కూడా ఈ రోజు ప్రజా సేవకు ఉపయోగ పడే కార్యాలయ నిర్మాణం కు సహకరిస్తూ ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంప్ లు పెట్టడం అభినందనియం అని వారు పేర్కొన్నారు