బ్రాహ్మణ సంక్షేమ భవనానికి సహకరిస్తా…. బత్తుల లక్ష్మారెడ్డి.
మిర్యాలగూడ ప్రజాలహరి….
మిర్యాలగూడ పట్టణ ప్రాంతంలో బ్రాహ్మణుల ఎన్నో ఏండ్ల కల అయినా బ్రాహ్మణ సంక్షేమ భవనం సమస్యను త్వరలో పరిష్కరిస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు . మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని శివాలయంలో జరిగిన శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. వారికి సమావేశాలు నిర్వహించుకోవడానికి సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఈ సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించి వారికి ఒక భవనం ఏర్పాటుకు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ భార్గవ్ మాట్లాడుతూ బ్రాహ్మణులకు అపరకర్మలు చేసుకోవడానికి అనువైన స్థలాన్ని పరిశీలించి త్వరలో కేటాయిస్తామని తన వంతు సహకారం ఇస్తానని చెప్పారు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ బండారు కుశలయ్య మాట్లాడుతూ బ్రాహ్మణుల కు దేవాలయం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మురళీ శర్మ, ఆదిత్య శర్మలు మాట్లాడుతూ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తాము ముందు ఉండి సహకారాలు అందిస్తామని చెప్పారు. మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ బ్రాహ్మణులకు అన్ని విధాల సహకరిస్తానని చెప్పారు మిర్యాలగూడ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బోయినపల్లి వెంకటరమణారావు, కురుమేటి రాధాకృష్ణ లు మాట్లాడుతూ మిర్యాలగూడలో బ్రాహ్మణ సంఘ సభ్యుల నిత్యం అందుబాటులో ఉంటామని వారి సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లయితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు కొప్పుల వెంకటేశ్వరరావు పులి కృష్ణమూర్తి , వెంకటరామయ్య శర్మ, పుల్లభట్ల లక్ష్మీ నర్సయ్య శర్మ, పైడిమర్రి ప్రసాద్ శర్మ, ప్రజాలహరి ఎడిటర్ చిట్యాల శ్రీనివాస్ శర్మ అసోసియేట్ ఎడిటర్ వెంకటరమణ శర్మ, జగదీష్ శర్మ శివాలయం కార్యదర్శి మట్టయ్య తదితరులు పాల్గొన్నారు