Ultimate magazine theme for WordPress.

రెండోసారి ప్రజాభిప్రాయo పెట్టడానికి కారణాలేంటి జూలకంటి రంగారెడ్డి

Post top

రెండవ సారి పర్యవరణ ప్రజాభిప్రాయం ఎందుకు పెట్టారో చెప్పాలి

*ఏండ్లు గడిచిన కనిపించని గ్రీనరీ

*ప్రభావితం గల గ్రామాలకు నష్ట పరిహారం ఇవ్వాలి

*ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి

 

ప్రజాలహరి-మిర్యాలగూడ

 

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద మంగళవారం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయం సేకరణలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు ఏర్పాటు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని ఆ సమయంలో విదేశీ బొగ్గు వాడుతామని చెప్పారని దానివలన పరిసర ప్రాంతాల ప్రజలకు భూములకు జంతువులకు వాతావరణానికి ఎలాంటి కాలుష్యం, ప్రాణాపాయం ఉండదని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు స్వదేశీ బొగ్గును వాడేందుకు చూస్తున్నారని, దీనిపై న్యాయస్థానంకు వెళ్లడం వల్ల మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెప్పారు. ఎందుకు స్వదేశీ బొగ్గు వాడుతున్నారో, మాట మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. ప్లాంటు నిర్మాణం సమయంలో 40% గ్రీనరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఒక్క మొక్క కూడా నాట లేదని చెప్పారు. ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని ఇప్పుడు గ్రీనరీ లేక, చెట్లు లేక గాలి, నీరు కలుషితమవుతున్నాయని దాని ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపై నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట పూర్తిగా దిగుబడి తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం దుమ్ము, దూళి వెదజల్లి పంటల పొలాలు, ఆహారం పై పడి అంతా కలుషితమై దాని ఫలితంగా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పారు. మిర్యాలగూడ పట్టణం నుండి దామరచర్ల నుండి వీర్ల పాలెం ప్రాజెక్టు వరకు ప్రాజెక్టు ప్రభావితo చేస్తున్నదని, భవిష్యత్తులో కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలో పంట పొలాలు పండే పరిస్థితి ఉండదని ప్రజలు అనారోగ్యాల పాలవుతారని, పశువులు, పక్షులు జీవించలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్న నర్సాపురం, వాడపల్లి, మరి కొన్ని గ్రామాలను ఆ జాబితాలో చేర్చలేదని దాని వలన ప్రజలు, రైతులకు పరిహార అందక నష్టపోయారని తెలిపారు. ఆ గ్రామాలను కూడా బాధిత గ్రామాలుగా చేర్చి అక్కడి రైతులకు పరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంతో ఆశతో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముంపు బాధిత గ్రామల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, మంచినీరు అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అన్ని గ్రామాలలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో చెట్లను పెంచి గ్రీనరీని పెంపొందించాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణo ఉండేవిధంగా గ్రామాలను తీర్చిదిద్దాలన్నారు. ప్రాజెక్టు ప్రభావితం చూపే ప్రాంతం వరకు అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి మాట్లాడే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ప్రజలందరూ హర్షానికేతనo ఎగరవేశారు. అంశాలు వారిగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తి అధికారులను ప్రశ్నిస్తుంటే ప్రజలు చప్పట్లు ఈలులతో మద్దతు తెలిపారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.