
మిర్యాలగూడ ప్రజాలహరి
.. ఫిబ్రవరి 24వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో అధికారికంగా నిర్వహించే గిరిజనుల ఆరాధ్య దైవం *సద్గురు శ్రీ శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్* జయంతి వేడుక పై RDO కార్యాలయంలో బంజారా పెద్దలు, ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ *శ్రీ శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ గారు* గిరిజనులకే కాదు ఎంతో మంది హైదవులకు ఆరాధ్య దైవం.. వారి జీవితం ఎంతో మంది కి ఆదర్శం అని అన్నారు.. వారి జయంతి వేడుకలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం చాలా ఆనందించదగిన విషయం అని అన్నారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలో *ఫిబ్రవరి 24 న* అధికారికంగా నిర్వహించబోయే జయంతి వేడుకల్లో గిరిజన సోదరులు అధికసంఖ్యలో రాజకీయాలను అతీతంగా గిరిజనుల ఐక్యతను చాటి చెప్పే విధంగా పాల్గొనాలని అన్నారు .. మన మిర్యాలగూడ నియోజకవర్గ గిరిజనుల ఐక్యత గురించి ఇక్కడ మనం నిర్వహించే శ్రీ సంత్ సేవా లాల్ గారి జయంతి వేడుకల గురించి రాష్టం మొత్తం మాట్లాడుకునేలా విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, బీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సిద్దు నాయక్ తదితరులు అధికారులు, గిరిజన పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..