
సాగర్ ప్రాజెక్టు పరిధిలో నీటికి కటకట……పంటలు కాపాడుకోవడం కోసం విపరీతంగా బోర్లు వేస్తున్న రైతులు… నీళ్లు లేక దిగుబడి తగ్గే అవకాశం… మిర్యాలగూడ ప్రజాలహరి ………….,…….మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో తాగునీటికి, సాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు వచ్చాయి.ఇప్పటికే పలు గ్రామాల్లో బోర్లలో చెరువులలో నీళ్లు అడగండిపోవడం ప్రమాద సాంకేతాలను చూపిస్తుంది. సాగర్ పరిధిలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్ పరిధిలో వేసిన వ్యవసాయ పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేయని ప్రయత్నాలు లేవు. పంటల వద్దనే పడిగా అప్పులు పడుతున్నారు. నీటిని అన్వేషించడం కోసం పలుమార్గాలను వెతుక్కుంటున్నారు కొందరు రైతులు లక్షల రూపాయలు పెట్టి తమ పంట పొలాల్లో బోర్లు వేయిస్తున్నారు. మరికొందరు ట్యాంకుల ద్వారా డ్రమ్ముల ద్వారా సరఫరా చేస్తున్నారు.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది ఒకవైపు కరెంటు కోత మరోవైపు నీటి ఎద్దడి పల్లెలో నీటి ఘర్షణలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి భూగర్భ జలాలు అడుగంటి పోవడం వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి కొంత మంది రైతులు ఇప్పటికే తమ వేసిన పంటలకు నీరు అందించలేక వదిలివేశారు మరి కొందరు మాత్రం వేసిన పంటలను కాపాడుకోవడం కోసం విపరీతమైన కష్టాలు పడుతున్నారు ఇటీవల పాలేరు రిజర్వాయర్కు నీరు తరలించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్న నాలుగు మేజర్ల కు నీటిని విడుదల చేయకపోవడo భూగర్భ జలాలు మరింత అడుగంటి పోవడానికి కారణమైంది. నిత్యవసరాలకు సైతం నీటి కటకట… మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని రాజగట్టు గ్రామంలో నీటి స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో పరిష్కరించడానికి ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు గ్రామంలో ఉన్న చెరువులు ఎండిపోవడం ఈ సమస్య కారణం ఈ గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు వాటర్ డ్రమ్ములు మనకు కనిపిస్తుంటాయి ట్యాంకర్లు వచ్చిన సమయంలో నీటిని రోజు వారి అవసరాల కోసం వాటిని ఉపయోగిస్తున్నారు