*వేములపల్లి ప్రజాలహరి……అన్నదాతకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి* -మూసి నాది నీటితో చివరి ఆయకట్టు రైతులను కాపాడాలి. సాగర్ ప్రాజెక్టును ఎగువ ప్రాంతం నుంచి నీటిని తీసుకువచ్చి నింపాలి. -సల్కునూరు సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పృధర్ రెడ్డి ,డైరెక్టర్ పల్లభిక్షం. సూర్య సేన ప్రత్యేక ప్రతినిధి వేములపల్లి:- మూసి ప్రాజెక్ట్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఉన్న చివరి రైతులను కూడా ఆదుకోవాలని సల్కునూరు సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పృధర్ రెడ్డి డైరెక్టర్ పల్లభిక్షం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మండల కేంద్రంలోని సల్కునూరు సహకార సంఘంలో ఆయన మాట్లాడారు. అన్నదాతలకు యాసంగి పంటకు నీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు నీరు అందించాలన్నారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టులో నీరు లేక ఎడమ కాలువ కింద సాగయ్యే ఆయకట్టు ఉన్న రైతులకు నీరు అందె పరిస్థితి లేదన్నారు. మూసి ప్రాజెక్ట్ లో నీరు రోజు తగ్గుముఖం పట్టడంతో ఆయకట్టు కింద ఉన్న రైతులకు వారం బంద్ కాకుండా ప్రతిరోజు నీటిని పంట పొలాలకు ఇవ్వాలని కోరారు. మూసి ప్రాజెక్టు కింద చిన్న ,సన్నకారు రైతులు ఎక్కువ ఉండడంతో అన్నదాతలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా చర్లగూడెం, భీమనపల్లి ,కలవలపాలెం, పోరెడ్డి గూడెం, చిరుమర్తి, పాములపాడు, ఆగ మోత్కూర్ ఎరుకలగుట్ట, లక్ష్మీదేవి గూడెం ఆమనగల్లు ,సల్కునూరు చివరి ఆయకట్టు ఉన్న రైతులకు ప్రతిరోజు యాసంగి పంటకు నీరు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. సాగర్ ప్రాజెక్ట్ మూసి ప్రాజెక్టులను ఎగువ ప్రాంతం నుంచి నీటిని తీసుకువచ్చి వెంటనే నింపాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
