![home side top](https://i0.wp.com/www.prajalahari.com/wp-content/uploads/2024/12/Adobe-Photoshop-PDF-12-09-2024_12_16_AM.png?w=1170&ssl=1)
*సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శిగా పుట్టల రాములు*
/వేములపల్లి: వేములపల్లి సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శిగా పుట్టల రాములు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు పుట్టల రాములు ను సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు , ఈ సందర్భంగా పుట్టల రాములు మాట్లాడుతూ అధినాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు, తన నియమకానికి సహకరించిన మండల కార్యదర్శి జిల్లా యాదగిరి కి ధన్యవాదాలు తెలియజేశారు.