నందిపాడు శివారులో రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి ఒకరు గాయాలు మరణించిన కుటుంబాల్లో విషాదం…… ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ…..
మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకున్న అనే లోపునే రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు మరో కుటుంబాల్లో తండ్రి, కొడుకు మృతిచెందగా మరో మహిళకు గాయాలు అయ్యాయి… వివరాలలో వివరాలు ఇలా ఉన్నాయి…. మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన చెరుపల్లి మహేష్ హైదరాబాదులో ఫోటోగ్రాఫర్ గా జీవనం సాగిస్తున్నారు వరుస సెలవు వరుస సెలవులు కావడంతో భార్య పిల్లలు బంధువులను తీసుకొని విజయవాడ ప్రాంతానికి వెళ్లి అక్కడ దుర్గాదేవి ,పెనుగంచిప్రోలు అమ్మవారు దర్శనాలు చేసుకొని తిరిగి హైదరాబాద్ పోవడానికి ప్రయాణమయ్యారు మార్గమధ్యలో తమ స్వగ్రామమైన నందిపాడులో కొంత విశ్రాంతి తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు కానీ విధి ముందు ఆయన మృత్యువాత పడ్డారు ఆదివారం రాత్రి సుమారు 11 నుంచి 12 గంటల సమయంలో నందిపాడు క్రాస్ రోడ్డు సమీపంలో వారి కారు ను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఒకరికి బలమైన గాయాలు అయ్యాయి. చెరుపల్లి మహేష్ 32 భార్య జ్యోతి 30 కూతురు రిషిత 6 తోడల్లుడు మహేందర్ 32 ఆయన కుమారుడు లియాన్స్ 2 అక్కడికక్కడే మృతి చెందారు. తోడల్లుడు భార్య మహేందర్ మాధవి బలమైన గాలి ఆసుపత్రిలో ఉన్నది. ఈ ప్రాంతం ఆక్సిడెంట్ జోన్లుగా పేరుగాంచింది ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ కట్టాలని పాలకులకు పలు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదు ఈ ప్రాంతంలో నెలలో రెండు మూడు సార్లు జరుగుతుంటాయి .రెండు కుటుంబాల్లో ఈ ఆక్సిడెంట్ కారణంగా విషాదం కలిగింది. నందిపాడు గ్రామానికి చెందిన ప్రజలు అందరు తండోపతండాలుగా అక్కడ చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు .అప్పటికే వారు మృతి చెందారు .మాధవికి మాత్రమే చికిత్స జరుగుతుంది .ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.