*ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ సిద్ధాంతం – బంటు*
ప్రజాలహరి వేములపల్లి. ….ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా (సిపిఐ)భారత కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని బంటు వెంకటేశ్వర్లు అన్నారు, ఆదివారం వేములపల్లి మండల కేంద్రంలో గీతా కార్మిక సంఘం కార్యదర్శి పుట్టల రాములు అధ్యక్షన జరిగిన మండల సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వతంత్ర ముందు నుండి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల తరఫున నిలబడి రైతు కార్మిక సంఘాలను ఏకం చేసి నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడి ప్రజా సమస్యలను తీర్చడంలో ముందున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని నేడు ప్రజలకు ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ పార్టీగా నిలవబోతున్నదని అన్నారు ముఖ్యంగా ప్రజా సమస్యలను గుర్తించడంలో అత్యంత ఉత్సాహాన్ని చూపించే పార్టీ సిపిఐ పార్టీ అని గుర్తు చేశారు ఈ మండలంలో నేటికీ అనేక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ వాటిని తీర్చడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు, ముఖ్యంగాఈ మండలంలో అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై సర్వీస్ రోడ్డు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్నారు సిపిఎం పార్టీ ప్రజల పక్షాన నిలబడి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలని దాని కోసం మండలంలోని సిపిఐ కార్యకర్తలు అందరూ ఓ సైనికుల్లా పనిచేసి సర్వీసు రోడ్డు,అండర్ పాస్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు వేములపల్లి మండల కేంద్రంగా ఇప్పటికే చాలా రైస్ ఇండస్ట్రీస్ ఏర్పడి ప్రధాన రహదారిపై కాలుష్యం ఎక్కువైందని దానికి తగిన చర్యలు తీసుకొని కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేయాలని అన్నారు దాంతోపాటు రైస్ మిల్లుల నిర్మాణం ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ మరో కొన్ని నిర్మాణం చేపట్టడం తద్వారా కాలుష్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి నెలకొంటుందని అన్నారు,ఇక్కడ ఉన్న రైస్ మిల్లులు సరిపోతుందని ఇకమీదట కొత్త రైస్ మిల్లుల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని దానికోసం కమ్యూనిస్టు పార్టీ కార్యనిర్వహణ చేపట్టాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, గీత కార్మిక సంఘం మండల నాయకులు పుట్టల రాములు, పల్ల వెంకన్న,పుట్టల కృష్ణయ్య, మిర్యాలగూడ నియోజకవర్గం సిపిఐ నాయకులు, వలంపట్ల వెంకన్న , మహిళా నాయకులు పద్మ హింసాని,బొంగర్ల సత్యం, పుట్టల కృష్ణయ్య పగడాల కొండయ్య బోంగర్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.