#దేశంలోనే అజేయశక్తి ‘బీఆర్ఎస్’
* పార్టీలో సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా
* బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కవచంగా ప్రమాదబీమా
* 100 కోట్ల రూపాయలకు పైగా బీమా చెల్లింపు
* రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన గంగుల స్వప్న కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత : మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశంలోనే అజేయశక్తిగా అవతరిస్తోందని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.
ప్రమాద బీమా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కవచంగా పనిచేస్తోందని అన్నారు. ఉద్యమ కాలం నుంచి జెండా పట్టి సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తూ మృతిచెందిన ప్రతీ కార్యకర్తకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నామని అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని క్లిష్ట సమయాల్లోనూ కార్యకర్తలను ఆదుకునే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని చింతపల్లి గ్రామానికి చెందిన గంగుల స్వప్న రూ.100 చెల్లించి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్వప్న కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అందిన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఆమె నామినీకి మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి టౌన్ షిప్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భాస్కర్ రావు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు ఆపన్న హస్తం అందిస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు కేటీఆర్ రూ.100 కోట్లకు పైగా ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అండగా నిలుస్తామని భాస్కర్ రావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, దామరచర్ల జడ్పీటీసీ అంగోతు లలిత హాతిరాం నాయక్, చింతపల్లి సర్పంచ్ బానావత్ లలిత సక్రు నాయక్, ప్రకాష్ నాయక్, భిక్షం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, షేక్ ఫయాజ్, చెన్ను రామారెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.