Ultimate magazine theme for WordPress.

వేములపల్లి లో ఘనంగా గణతంత్ర వేడుకలు

Post top

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వేములపల్లి జనవరి 26(ప్రజాలహరి ): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలో పలు గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పుట్టల సునీత, తహసీల్దార్ కార్యాలయం ఎదుట తహసిల్దార్ శ్రీనివాస శర్మ, పిఎసిఎస్ ఎదుట చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఎదుట పాస్టర్ రెవ. డా. స్పర్జన్ జాతీయ జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టారు.కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని, సూపరింటెండెంట్ నరసింహ, ఆర్ఐ మహేందర్ రెడ్డి, ఏపీఎం అనూక్, సి హెచ్ ఓ స్వామి, కార్యదర్శి సాల్మన్ రాజ్, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.