మిర్యాలగూడ ప్రజాలహరి …మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ నందు విద్యార్థుల మధ్య నిర్వహించిన *75వ గణతంత్ర దినోత్సవ* వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.. జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది … విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అనంతరం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..మేము మీ అందరిచేత మిర్యాలగూడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తరవాత వచ్చిన మొదటి సారిగా గణతంత్ర వేడుకలు.. ఇలా పిల్లలందరితో కలిసి జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతషంగా ఉంది…
నాకు ఈ రాజకీయాలు పెద్దగా తెలియదు.. నాకు తెలిసింది ప్రజలకు సేవ చేయడం, వారి ముఖాల్లో ఆనందం చూసి నేను ఆనంద పడటం అంతే తెలుసు .. నేను ఒక్కటే బాగా నమ్ముతాను నేను మిర్యాలగూడ నియోజకవ్గంలో మెరుగైన విద్య, వైద్యన్ని ప్రతీ పేద, మారుమూల గ్రామాలకు చేరేలా చేయగలిగితే చాలు MLA గా నేను విజయం సాధించినట్టే అని భావిస్తాను..
అదే లక్ష్యంతో నేను గెలిచిన వెంటనే ఈ నోట్ బుక్స్ ఆలోచన చేశాను .. విద్యా దానం కంటే గొప్పది ఎది లేదు… ఒక వెనుక బడిన జాతుల్లో, వెనుక బడిన కులాల్లో, ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి నిన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లగలిగేది ఒక్క విద్య మాత్రమే.. విద్య ఉంటే దేన్నీ అయిన జయించ వచ్చు అలాంటి విద్యని ప్రతిఒక్క పిల్లవాడికి చేరే విధంగా మనమంతా కలిసి కృషి చేయాలి…
ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు బలంగా ఒక సంకల్పంతో కృషి చేస్తే ఎంతోమంది మారుమూల గ్రామాలలో విద్యార్థులకు ఉచితంగా మెరుగైన విద్య ని అందించగలుగుతాము. .. మనం అందరం కలసి కట్టుగా పనిచేద్దాం విద్య లో మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం అని అన్నాను.. దానికోసం వారంలో ఒకరోజు ఒక ప్రభుత్వ పాఠశాల సందర్శిస్తామని అన్నారు.. అలాగే *నేను నా మిర్యాలగూడ* పోస్టర్ ని విడుదల చేసారు , మా ఆధ్వర్యంలో ఆగస్ట్ 15 వ తేదీన చేయబోయే కార్యక్రమాల వివరాలు తెలియజేస్తామని అన్నారు… రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య మిర్యాలగూడ డిఎస్పి వెంకటగిరి ఎంఈఓ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు