మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవి పై అవిశ్వాసం అధికార పార్టీకి పోకచక్కల తయారైంది. ముందుకు పోలేని, వెనక రాలేని పరిస్థితి తయారైంది .32 మంది సభ్యులు మద్దతు కూడిన తీర్మానం అవసరం. మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో 48 మంది కౌన్సిలర్ ఉండగా నలుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు చనిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పదో వార్డు కౌన్సిలర్ గా ఉండి ఎమ్మెల్యే గా గెలుపొందిన అనంతరం రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి మృతి చెందారు.. ప్రస్తుతం బిఆర్ఎస్ కు బిజెపితో కలిపి 23 మంది ,కాంగ్రెస్కు సిపిఎంతో కలిపి 19 మంది బలం ఉన్నది.. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉన్న బలబలాలు చూస్తే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా 13 మంది సభ్యుల మద్దతు అవసరం. వరుస ఎన్నికల నేపద్యంలో అవిశ్వాసంపై ఏమి చేయాలన్నది మిర్యాలగూడలో చర్చ అంశంగా మారింది 24వ తేదీన తేదీన మున్సిపల్ సమావేశం ఉండడంతో అందరూ అవిశ్వాసంపై మాట్లాడుకుంటున్నారు