భారత దేశపు కీర్తి కిరీటంపై బాలరాముడు రూపంలో అయోధ్యలో ప్రాణప్రతిష్టుడైన వేళ…
ప్రజాలహరి జనరల్ డెస్క్..
ప్రపంచ మానవాళికి సత్య ధర్మములు ఎలా పాటించాలి ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలనేది వైకుంఠం వదిలి భూలోక వేంచేసి అయోధ్యలో కౌసల్య గర్భాన జన్మించిన ఆ బాల రాముడు నేడు వందల ఏళ్ళు పోరాటా అనంతరం బాలరాముడు రూపంలో ప్రతిష్ట అయ్యాడు అయోధ్య బాబ్రీ మసీద్ వివాదము వందల ఏళ్ల బట్టి కొనసాగుతూ వస్తున్నది . భారతదేశనికి ఆనాడు ధర్మము సత్యము మార్గాలు అనుసరించాలని రాముడు ఏ విధంగా సూచించాడు నేడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సత్యము ధర్మము మతవర్ణాల విద్వేషాలు లేకుండా అయోధ్యను హిందూ ధర్మానికి అప్పగించి అయోధ్య బాల రాముని ప్రతిష్టించిన మహానుభావుడు కులము మతము వర్ణము వర్గము రూపాలలో విచ్ఛిన్న శక్తుల చేతులు చీలిపోతూ సనాతన హిందూ ధర్మం మంట కలిసి పోయే సమయంలో బాలరాముడి దివ్య ఆశీస్సులతో మనకు లభించిన మోడీ ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడిన మహాభావుడు మన మోడీ. భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆ మహా పురుషుని అందమైన బాలరామున్ని చూడటానికి తపనబడ్డ హృదయాలకు శాంతన లభించింది. సోమవారం ఉదయం 12 గంటల 30 నిమిషాలకు స్వామివారు ప్రాణ ప్రతిష్ఠుడు కావడంతో ప్రజలు ఎంతో ఆనందంగా పండుగలు జరుపుకున్నారు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ అంటూ రాష్ట్రాల వారిగా భేదాలు లేకుండా వారి వారి గ్రామాల్లో ఉన్న దేవాలయాలను అందంగా అలంకరించుకొని స్వామివారి అమ్మవార్లకు పూజలు చేసుకుని బాలరాముడు ప్రతిష్టకై పడ్డారు తపన పడ్డారు వారి కోరిక 12 గంటల 30 నిమిషాలకు నెరవేరింది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తదితరులు ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ట వేద పండితుల సమక్షంలో జరిగింది స్వామియాన్ని అందమైన మందార మకరంద పుష్పాలతో అలంకరించారు సువర్ణ ఆభరణాలతో స్వామివారు మనకు దర్శనమిచ్చినాడు శ్రీ బాల రాములవారు ఒక దక్షిణ హస్తమునందు ధనుర్భానము ధరించి అభయ ప్రదానమిస్తున్నాడు. వామ హస్తమునందు బిల్లును ధరించి ప్రజలకు నేను రక్షగా ఉంటానని సూచించారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు దేశం మొత్తం ప్రపంచం మొత్తంగా 7500 మంది ప్రముఖులని ముఖ్య అతిథులుగా భారత ప్రభుత్వం మరియు దేవాలయ ట్రస్టు ఆహ్వానించారు అయోధ్యకు ర బలరాముని ప్రాణ ప్రతిష్ట చూడటానికి భక్తుల కోసం వెయ్యి రైలు ప్రత్యేకంగా వేశారు.