తమ్మినేని పరామర్శించిన జూలకంటి
మిర్యాలగూడ ప్రజాలహరి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములతో కలిసి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం కుదుటపడి కోలుకుంటున్నారని చెప్పారు. త్వరలోనే ప్రజల వద్దకు వస్తారని తెలిపారు.