ప్రజాలహరి మిర్యాలగూడ.
మాడుగుల పల్లి మండలం కుక్కడం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కుక్కడం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి ఈరోజు NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ కార్యక్రమానికి హాజరై బహుమతులను అందజేశారు.. మొదటి స్థానంలో నిలిచిన గూడూరు గ్రామ టీం వారికి 20 వేల రూపాయల నగదు బహుమతి మరియు షీల్డ్.. రెండవ బహుమతి కుక్కడం ఆర్గనైజర్స్ కి 15000 రూపాయల నగదు బహుమతి మరియు షీల్డ్.. మూడవ బహుమతి మొలకపట్నం గ్రామ వారి టీం కి పదివేల రూపాయల నగదు బహుమతి మరియు షీల్డ్ లను అందించి, ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు.. కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, స్థానిక సర్పంచ్ అలుగుబెల్లి గోవిందరెడ్డి, బిఆర్ఎస్ నాయకులు రాబర్ట్, మాజీ ఎంపిటిసి పద్మ, నాయకులు నకరికంటి శ్రీను, సోములు నూకపంగా, సాయి, మణి ,ఉదయ్, శేఖర్ కోదాటి తదితరులు ఉన్నారు..*