Ultimate magazine theme for WordPress.

సీఎం ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*లబ్ధి దారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి –

మిర్యాలగూడ ప్రజలహరి

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ARC ఫంక్షన్ హాల్ నందు *మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ కల్యాణ లక్ష్మి, శాధిముభారక్ చెక్కుల పంపిణీ* కార్యక్రమంలో పాల్గొని లబ్ధి దారులకు చెక్కుల పంపిణీ చేసిన శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి .. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ గతంలో అప్లికేషన్స్ పెట్టుకొని పెండింగ్ లో ఉన్న చెక్కులను ఈరోజు లబ్ధి దారులకు అందజేయడం జరుగుతుంది … మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అతి త్వరలోనే అమలు చేయడం జరుగుతుంది … కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నెల రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయడం జరిగింది అని అన్నారు.. ఈ కార్యక్రమంలో అధికారులు , సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.