వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
జర్నలిస్ట్ ప్రజాలహరి….
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఆయన గురువారం దావోస్ లో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం క్షీణిస్తున్నదనీ భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయని అందుకోసం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కోసం రైతులకు రైతు భరోసా రుణమాఫీ వంటి పలు పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కోరారు