పేదలకు చీరలు పంపిణి….
,. అన్న దాన కార్యక్రమం…. మిర్యాలగూడ ప్రజాలహరి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్ఫూర్తితో పులి మేడు ఆశ్రమం గురు స్వామి దేశిడి శేఖర్ రెడ్ది ఆధ్వర్యంలో అన్న దాన కార్యక్రమంతో పాటు చీరల పంపిణి కార్యక్రమం చేపట్టారు. గురువారం కేరళ లోని త్రివేండ్రo లో గల అనంత పద్మ నాధుడు.. తమిళనాడు లోని రామేశ్వరం. మధురై లోని మధుర మీనాక్షి.. అరుణాల చలం.. తిరుపతి లోని పద్మావతి టెంపుల్ తదితర ప్రాంతాల్లో చీరలు. అన్న దాన కార్యక్రమం చేపట్టారు.. అనంతరం అయ్యప్ప గురు స్వామి దేశిడి శేఖర్ రెడ్ది మాట్లాడుతూ.. సామాజిక వేత్తగా ఆయన చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ బి ఎల్ ఆర్ గారు శ్రీ శ్రీనివాస కళ్యాణం శుభమస్తు కార్యక్రమంలో ఇప్పటికే కొన్ని వేలమంది దంపతులకు మ్యారేజ్ పిట్టల అందజేయడం జరిగిందని అదేవిధంగా ఆయన శాసన సభ్యులుగా ఎన్నికైన తర్వాత పుష్పగుచ్చాలు శాలువాల తో నాకు సన్మానం చేయరాదని పుస్తకాలు తెస్తే చాలునని ఆ పుస్తకాలన్నింటినీ 26 జనవరి రోజు ప్రభు ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందించే బాధ్యతను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఎల్ఆర్ బ్రదర్స్ తీసుకుంటారని వారు చెప్పడం యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఇలా వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అందుకు అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ తోడుండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు ఇవ్వాలని మా పులిమేడు ఆశ్రమం స్వాముల ద్వారా ఆ దేవుడుని వేడుకుంటున్నామన్నారు
ఈ కార్యక్రమం లో పులిమేడు ఆశ్రమం గురు స్వాములు గోదాల జానకి రాంరెడ్డి.. దేశిడి కిషోర్ రెడ్ది.. అనంత సాయి.. యాది రెడ్ది. తాళ్ల వెంకట్ రెడ్ది.. చిట్ల శ్రీనివాస్. రాజా. రంగారావు. ఆంజనేయులు. దేవేo ధర్ రెడ్ది. నరేష్..రాము. నవీన్. దినేష్… కుప్పాల శ్రీనివాస్ రావు. డప్పు శ్రీనివాస్. కొండల్. నరేందర్. నూకల సతీష్ రెడ్ది. నాగిరెడ్డి. కిరణ్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు