ఈనెల 22న నల్గొండ పార్లమెంటు బిఆర్ఎస్ నియోజకవర్గ సదస్సును విజయవంతం విజయవంతం చేయాలి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

*తెలంగాణభవన్‌లో ఈనెల22న బీ.ఆర్.ఎస్ పార్టీ నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సమావేశం*.
మిర్యాలగూడ ప్రజాలహరి
ఈ నెల 22న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన జరుగు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని పురస్కరించుకుని ఈరోజు మిర్యాలగూడ పట్టణం, వైదేహి టౌన్‌షిప్‌లోని బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయా మండలాల ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు , రాష్ట్ర ఆగ్రోస్ మాజీ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , నల్గొండ జిల్లా DCMS ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి జిల్లా రైతు బంధు సమితి మాజీ అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు..