Ultimate magazine theme for WordPress.

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Post top
home side top

  అనంతపురం భారత ప్రధాని

నరేంద్ర మోదీ( Narendra Modi ) ఏపీలోని సత్యసాయి జిల్లాలోని నాసిన్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయాన్ని , శిల్పకళా సంపదను సందర్శించారు. ఆలయంలో లేపాక్షి వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ తిరిగి ఆలయ విశిష్టతను, స్థలపురాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి గుడిలోని వేలాడే స్తంభం గురించి అధికారులు మోదీకి వివరించారు.

అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్‌)ను ప్రధాని ప్రారంభించనున్నారు. . ప్రధాని పర్యటనలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

 

post bottom

Leave A Reply

Your email address will not be published.