*అయ్యప్ప ఆలయం లో అభిషేకలు*
… *ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి… పుస్తకాలతో తులా భారం*
… *శబిరిమలకు తరలివెల్లిన అయ్యప్ప స్వాములు..*
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ పట్టణం లోని రెడ్డికాలనికి చెందిన పులిమేడు ఆశ్రమం ప్రధాన *గురు స్వామి దేశిడి శేఖర్ రెడ్ది* ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప దేవాలయం లో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి* సన్మానం కాకుండా నోటు పుస్తకాలు అడగడంతో అయనను తరాజులో కుర్చోపెట్టి తులా భారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా శేఖర్ రెడ్ది మాట్లాడుతూ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి * దాదాపుగా పది సంవత్సరముల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలను వాటిలో ముఖ్యంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం శుభమస్తు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలలోని ఆడపడుచులకు కళ్యాణ శుభమస్తు కిట్లను ముస్లింలకు షాదీ ముబారక్ కిట్లను అదేవిధంగా వినాయక చవితి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను వారి నాన్నగారి పేరు మీద ఈశ్వర బంధం కార్యక్రమాన్ని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల గురవుతున్నారని నియోజకవర్గం వ్యాప్తంగా BLR హెల్మెట్లను విద్యార్థులకు పరీక్షా సమయంలో వారు మానసిక ఒత్తిడికి లోను కాకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతిరోజు పల్లి పట్టి వంటి పోషకాలు కలిగినటువంటి చిరుతిండ్లను వారి కందిస్తూ ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే ధైర్యాన్నిస్తున్నటువంటి BLR గారి స్ఫూర్తితో మా పులిమేడు ఆశ్రమ స్వాములు అనేక సేవా కార్యక్రమలలో పాల్గొంటున్నారని ఆనాటి రామచంద్రునికి భరత లక్ష్మణ శత్రజ్ఞులు ముగ్గురే తమ్ముళ్ళని కానీ ఈనాటి మన లక్ష్మన్నకు వారి వెంట ఉన్నారని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని అలాంటి లక్ష్మన్నకు అత్యధిక భారీ మెజార్టీ నుంచి గెలిపించిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ మా పులిమేడు ఆశ్రమ స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వార్డు ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.