క్రికెట్ పోటీలను ప్రారంభించిన నూకల వేణుగోపాల్ రెడ్డి ..
ప్రజాలహరి…… మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో MPL క్రికెట్ టోర్నమెంట్ ను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ నుంచి జిల్లాకు జిల్లాస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సహకరిస్తామని అదేవిధంగా స్టేడియం అభివృద్ధి పనులకు కూడా సహకరిస్తామని తెలియపరచారు. ఈ కార్యక్రమంలో 43 వ వార్డ్ కౌన్సిలర్ జానీ పాషా మరియు. ముఫ్తీ మొహమ్మద్ ఉమర్ అఖిల్ . అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీ మాజిద్,అభిషేక్, సాయి, గపూర్, లల్లు తదితరులు పాల్గొన్నారు.