మిర్యాలగూడ ప్రజాలహరి.
మిర్యాలగూడ RTC డిపో నందు తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ, వారు నిర్వహించిన *వనభోజన కార్యక్రమం లో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి *.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు కార్యక్రమం విజయవంతం కావడానికి RTC కార్మికుల కృషి ఎంతో ఉంది కావున ప్రతిఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.. RTC లో ఎలాంటి వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం వలన ఉద్యోగులలో మరింత ఉత్చాహం పెరగడంతో పాటు కార్మికుల మధ్య బంధం మరింత బలపడుతుంది అని అన్నారు.. అలాగే మీ అందరి కృషితో మిర్యాలగూడ డిపో రాష్ట్రంలోనే ఉత్తమ డిపో గా పేరు ప్రక్యతలు పొందాలని నా వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో RTC ఉద్యోగులు, కార్మికులు , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .