ప్రజాలహరి హైదరాబాద్…..
ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం ముగిసింది. ఐదు పథకాల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. దీనికి *ఛైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..* ని నియమించామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామం, తండా నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. *అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయి.* *ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి.* అతి తక్కువ సమయంలో విజయవంతంగా *1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించాం.* 40 రోజుల్లో హామీలు ఎలా నెరవేరుస్తారని విమర్శిస్తున్నారు. *ఏనాడు 40 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పలేదు.* *వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం.* యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతోంది. ఈనెల 30 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతుందని *మంత్రి పొంగులేటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* అన్నారు.