నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదo లోనేరేడుచర్ల కు చెందిన సీతమ్మ మృతి వారి కుమారుడు సీతారాం కు గాయాలు
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల నివాసి మృతి….(మిర్యాలగూడ, ప్రజాలహరి) నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకుచెందిన మంత్రి ప్రగడ సీతమ్మ (52) అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమారుడు మంత్రి ప్రగడ సీతారాం (40) తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాదు నుంచి తిరుపతి వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సును మిర్యాలగూడలో ఎక్కిన సీతమ్మ, సీతారామ్ లు బస్సు డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నారు. .కావలి సమీపంలో డ్రైవర్ అతివేగం కారణంగా ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో డ్రైవర్ తో పాటు సీతమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ పక్కనే ఉన్న ఆమె కుమారుడు సీతారామ్ కు బలమైన బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మృతురాలికి ఒక కుమార్తె నెల్లూరులో ఉండడంతో సీతమ్మ అంత్యక్రియలు అక్కడే జరిగాయి.