
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి…. ప్రజాలహరి మిర్యాలగూడ… మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచిన బత్తుల లక్ష్మారెడ్డి శనివారం కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గృహప్రవేశం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల 28 నిమిషాలకు బ్రహ్మీ ముహూర్తం లో వేదమంత్రాల మధ్యన కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేశారు. అనంతరం ఉదయం 10:00 నుంచి 11 గా ప్రాంతంలో కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు క్యాంప్ కార్యాలయం ప్రారంభ సందర్భంగా సర్వమత సమ్మేళన విధానం పాటించారు.