*జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం.*
మిర్యాలగూడ ప్రజాలహరి….. పట్టణంలో SR digi school కు చెందిన మాయేరా ఖుల్సుమ్ ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన 67వ జాతీయ స్కూల్ స్థాయి క్రీడలలో టైక్వాండోలో అండర్ 14 విభాగంలో కామాక్షయ పథకం సాధించిన విషయం తెలిసినదే ఈ సందర్భంగా జనయేత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునీర్ అహమ్మద్ షరీఫ్ జనయేత్రి కార్యాలయానికి పిలిపించి సన్మానం చేశారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా చాలా మంది పిల్లలు ఉన్నారు. వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీస్తే రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చినట్లు అవుతుంది. విద్యా వైద్య క్రీడల రంగంలో రాణిస్తున్న వారికి జనయేత్రీ ఎల్లప్పుడు అండదండగా ఉంటుందని మాయేరా ఖుల్సుమ్ భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు. జనయేత్రి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి అనుముత్యాలను వెలికి తీసి చిరు సన్మానం చేయడం ద్వారా వారిని ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పేసి వారిలో ఇంకొంచెం ఉత్సాహం వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్లి ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటారని ఇలాంటి టాలెంట్ ఉన్న వారిని ఎక్కడైనా ఉంటే జనయిత్రీ ఫౌండేషన్ వారికి ప్రోత్సహించి ముందుకు వెళ్లడానికి మేము ముందు ఉంటాము అని . ఈ కార్యక్రమంలో రషీద్ అహ్మద్ షరీఫ్, సాయి షాహిర్ హరి శ్రీనివాసరెడ్డి యాదగిరి సందీప్ ఫెరోజా నందిని విజయ అంజుమ్ తదితరులు పాల్గొన్నారు