పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాకు ప్రత్యామ్నాయంగా 60% నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకారం ……………………. తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఢిల్లీ పర్యటనలో వివరాలు……. ప్రజాలహరి జనరల్ డెస్క్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గురువారం ఢిల్లీలో బిజీ బిజీ గా కార్యక్రమాలను ఉన్నారు ముందుగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు గురించి పలువురు మంత్రులకు విజ్ఞప్తులు ఇచ్చారు భారత హోం శాఖ మంత్రి అమిత్ షాక్ కలిసి తెలంగాణకు ఐఏఎస్ లో కొరత ఉందని 280 కేటాయించాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ 2024 బ్యాచ్లో ఐఏఎస్లను కేటాయిస్తామని చెప్పారు. కేంద్ర జలవనుల శాఖ మంత్రి గజేంద్ర షేకావత్ ను కలిశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరగా వారు 2014 ముందు వరకే జాతీయ ప్రాజెక్టును విధానం ఉందని తర్వాత లేదు కావున ఇతర మార్గాల్లో 60శాతం నిధులు కేటాయిస్తామని వారు తెలిపారు అదేవిధంగా తెలంగాణకు తొమ్మిది, పది షెడ్యూల్లో పునర్విభజన కింద రావాల్సింది నిధులు వివాదాలను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్ భవన్ ,సెక్రటేరియట్, అసెంబ్లీ ఉపయోగించుకున్న వాటికి సంబంధించిన బకాయిలు కూడా వెంటనే చెల్లించే విధంగా చూడాలని కోరారు ఈరోజు యూపీఎస్సీ తరహాలో టిపి ఎస్సి ని నిర్వహించే విధంగా సంబంధించిన అధికారులతో చర్చలు జరపడం ఉన్నట్టు వారు పేర్కొన్నారు