సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) లో బీసీ ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు అన్యాయం…….జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ ప్రజాలహరి
ముఖ్యమంత్రి కార్యాలయంలో బీసీ అధికారులను నియమించాలని కోరుతూ కళ్లకు గంతలు కట్టుకొని మహాత్మా జ్యోతిభా ఫూలే గారికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయంలో అధికారుల నియామకంలో బీసీ అధికారులకు మొండి చేయి చూపిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.బీసీ ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల్లో సమర్థులు ఉన్నపటికీ గత ప్రభుత్వం మాదిరిగానే బీసీల పట్ల వివక్ష చూపుతున్నారు.కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నోసార్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సామాజిక న్యాయం జరగడం లేదని 90 మంది అధికారులకు కేవలం ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని అనేక సభలో చెప్పారని గుర్తు చేశారు.ఇప్పటి వరకు సీఎంఓ లో ఆరుగురు అధికారులను నియమిస్తే ఒక్క బీసీ అధికారి కూడా లేరని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటించి బీసీలను సీఎంఓ లో అధికారులుగా నియమించాలని కోరారు.