మిర్యాలగూడ వ్యవసాయమార్కెట్ పూర్వ వైభవము తీసుకొస్తా.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..
మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన బత్తుల లక్ష్మారెడ్డిని మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మరియు తెలంగాణ మార్కెటింగ్ రాష్ట్ర సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అవంతిపురం యార్డులో నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు చిలుక నరసింహారెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నీ గజమాలతో సన్మానించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఇవ్వాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మిర్యాలగూడ మార్కెటింగ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు క్రయవిక్రయాలు జరిగేలా చూస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు మకరుం, మధు మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీధర్ ఇతర నాయకులు సాంబయ్య, స్కైలాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు