..జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి ని పరామర్శించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు జగదీష్ రెడ్డి పరామర్శ…
మిర్యాలగూడ ప్రజాలహరి..
ప్రముఖ పారిశ్రామికవేత్త, నల్లగొండ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి ని మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాలియా లోని ఆయన నివాసం లో పరామర్శించారు.
యాదగిరి మాతృమూర్తి చిట్టిపోలు రాములమ్మ అనారోగ్యంతో ఇటీవలే స్వర్గస్తలయ్యారు. వారి నివాసంలో రాములమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు..
యాదగిరి తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.