ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దరఖాస్తుల డాటా ఎంట్రీ లపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయితీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్లను సి.ఎస్ అభినందించారు. ఈనెల 6 వ తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.