వేములపల్లి మండలాలలో ప్రజల వద్దకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డి
ప్రజాలహరి వేములపల్లి……….. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రజా పాలన* అభయ హస్తం గ్యారంటీలకు శ్రీకారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని క్రిస్టాపురం , అన్నారం గ్రామాల్లో మరియు వేములపల్లి మండలం సల్కునూర్ గ్రామంలో పాల్గొన్న *మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గ్రామ ప్రజలకు దరఖాస్తు ఫార్మ్ అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రజా పాలన కార్యక్రమం జనవరి 06 వ తేదీ వరకు కొనసాగుతుంది .. కావున ప్రజలు అందరూ సంయవనం పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ తమ దరఖాస్తులు అందజేయాలని కోరారు. రాష్ర్టంలో నూతనంగా కొత్త కరోనా వైరస్ కేసులు కూడా వస్తుండడంతో ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అన్నారు .. ఈ దరఖాస్తు అప్లికేషన్ ఫార్మ్ లు బయట ఎక్కడ కానరాదని, ప్రభుత్వమే ఉచితంగా ప్రతీ ఒక్కరికీ అందజేస్తుందని అన్నారు.. అలాగే *రేషన్ కార్డు* లేని వారు ఎవర్రు నిరుత్సాహ పడకూడదని , రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని అన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గత 10 సవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు..అందుకే అప్లికేషన్ తో పాటు ఒక తెల్ల కాగితంపై రేషన్ కార్డు అప్లికేషన్ కూడా రాసి ఇవ్వొచ్చని అన్నారు. . అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతిఒక్కరి దగ్గర అప్లికేషన్ ఫార్మ్ తీసుకోవాలి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ, ఇతర ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు .