వేములపల్లి మండలం ప్రజా పాలనలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి
వేములపల్లి ప్రజాలహరి…
వేములపల్లి మండలం మండలం ముల్కపట్నం, అమనగల్లు గ్రామాల్లో నిర్వహించిన *ప్రజా పాలన* అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన *మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రజా పాలన కార్యక్రమం జనవరి 6 వ తారీఖు వరకు కొనసాగుతుంది.. కావున అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. గ్రామస్థులు అందరూ కలిసి పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ది కమిటీలు ఏర్పాటు చేసుకొని, గ్రామం పేదరికంతో ఉండి అర్హులైన వారి జాబితాలు తయారు చేసుకుంటే.. నిజమైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.. అనంతరం అర్హులైన గ్రామస్థులు అందరికీ దరఖాస్తు ఫార్మ్స్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.