*ప్రజల వద్దకే పాలన.. ప్రజా పాలనలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి…
దామరచర్ల మండలం దిలావర్ పూర్ మరియు KJR కాలనీ గ్రామాలలో మంగళవారం నిర్వహించిన *ప్రజా పాలన* అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రజా పాలన కార్యక్రమం జనవరి 6 వ తారీఖు వరకు కొనసాగుతుంది.. కావున అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. గతంలో ప్రభుత్వ పథకాల దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడే వారు, దరఖాస్తులకు డబ్బులు లేక కూడా ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమాలకు దూరంగా ఉండేవారు.. కానీ అలాంటి ఇబ్బందులు ప్రజలకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రజల వద్దకే పాలన అనే ఈ మహోత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది… అలాగే కొందరు ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ లు అమ్ముతున్నారు.. దయచేసి ఎవ్వరు కూడా బయట కొని మీ డబ్బుని వృధా చేసుకోకండి.. ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచితంగా అప్లికేషన్ ఫార్మ్లు అందిస్తుంది అని ఎవరైనా అప్లికేషన్ ఫార్మ్స్ పేరుతో ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు .. అనంతరం అర్హులైన గ్రామస్థులు అందరికీ దరఖాస్తు ఫార్మ్స్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.