ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు
ప్రజలకు కావలసిన దరఖాస్తులు సైతం లేదు
వేములపల్లి( ప్రజాలహరి) తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు హామీలను నెరవేర్చటం కోసం ఈనెల 28వ తారీకు నుంచి వచ్చే నెల ఆరో తారీకు వరకు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో అన్నపురెడ్డి గ్రామంలో గురువారం ఎంతో అట్టహాసంగా స్థానిక ఎంపీపీ పుట్టల సునీత ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి గాను మండలంలోని పై స్థాయి అధికారులు అందరూ హాజరయ్యారు, ఇట్టి కార్యక్రమంలో గ్రామానికి సరిపోను దరఖాస్తు ఫారం లో లేకపోవడంతో గ్రామంలోని ప్రజలు వెనుతిరిగి పోయారు. ఇట్టి విషయాన్ని గ్రామ ప్రజలు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటికప్పుడు గ్రామంలో జిరాక్స్ దిగినటువంటి పాములు తెచ్చి తెప్పించి ప్రజలకు ఇవ్వాలని చూశారు. అప్పటికే గ్రామంలోని ప్రజలు దరఖాస్తు ఫారంలో లేకపోవడంతో వారి వారి పనులకు వెళ్లిపోవడం జరిగింది. ఏదిఏమైనాప్పటికిని ప్రభుత్వ ప్రవేశపెట్టిన అటువంటి సంక్షేమ పథకాలకు అధికారులు తూట్లు పొడుస్తూ నిర్లక్ష్యం వాయిస్తున్నట్టుగా కనులకు కొట్టినట్టుగా కనపడుతుంది. గ్రామం నేను ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతాయా లేవా అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక ఆర్డిఓ చెన్నయ్య, మిర్యాలగూడ డివిజనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ, ఎంపీ ఓ, వ్యవసాయ శాఖ అధికారి నితిన్, వెలుగు సిసి గోపి, విద్యుత్ ఏయి, ప్రాథమిక ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానిక ఎస్సై డి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు