*ప్రజా పాలనలో ప్రజల వద్దకు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి …
ప్రజాలహరి, మిర్యాలగూడ …..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రజా పాలన* అభయ హస్తం గ్యారంటీలకు శ్రీకారం కార్యక్రమం ప్రారంభించిన *మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ పట్టణంలోని *1,2,3,4,5,6,8* వార్డ్ లలో పర్యటించి దరఖాస్తు దారులకు దరఖాస్తు ఫార్మ్ అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రజా పాలన కార్యక్రమం జనవరి 06 వ తేదీ వరకు కొనసాగుతుంది .. కావున ప్రజలు అందరూ సంయవనం పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ తమ దరఖాస్తులు అందజేయాలని కోరారు.. ఈ దరఖాస్తు అప్లికేషన్ ఫార్మ్ లు బయట ఎక్కడ కానరాదని, ప్రభుత్వమే ఉచితంగా ప్రతీ ఒక్కరికీ అందజేస్తుందని అన్నారు.. అలాగే *రేషన్ కార్డు* లేని వారు ఎవర్రు నిరుత్సాహ పడకూడదని , రేషన్ కార్డు లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని అన్నారు.. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతిఒక్కరి దగ్గర అప్లికేషన్ ఫార్మ్ తీసుకోవాలి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్స్ శాగ నాగలక్ష్మి జలెందర్ రెడ్డి, ముందిరెడ్డి నర్సిరెడ్డి, చల్లా నాగమ్మ, మరియు కాంగ్రెస్ నాయకులు మేకల శ్రీనివాస్, బంటు లక్ష్మీనారాయణ, అంబటి క్రిష్ణ, అవుట శ్రీనివాస్ వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు .