కార్మికుల, ఉద్యోగుల భద్రత లక్ష్యంగా పరిశ్రమల యాజమాన్యాలు పనిచేయాలి, జాతీయ మైండ్స్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ప్రభాత్ కుమార్ పిలుపు
కార్మికుల భద్రతే లక్ష్యంగా పరిశ్రమల యాజమాన్యాలు పనిచేయాలి.. జాతీయ మైన్స్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్: ప్రభాత్ కుమార్
పెన్నా సిమెంట్ వారిచే 38వ మైన్స్ సేఫ్టీ వార్షికోత్సవ వేడుకలు
మిర్యాలగూడ, దామరచర్ల, ప్రజలహరి….
సిమెంటు పరిశ్రమల్లో కార్మికుల, భద్రత శ్రేయస్సు లక్ష్యంగా సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు పనిచేయాలని జాతీయ మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ (ధన్బాద్) ప్రభాత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలంలో ఉన్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 38వ మైన్స్ సేఫ్టీ వారోత్సవాలు మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీ ఎస్.పి కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగాయి .ఇట్టి కార్యక్రమానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుమారు 69 మైన్స్, మరియు 37 సిమెంట్ కంపెనీల అధికారులు, ఉద్యోగస్తులు, కార్మికులు హాజరైనారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ కార్మికులు ప్రభుత్వం యాజమాన్యాలు సూచించన నిబంధనం పాటిస్తూ వృత్తి నిర్వహణను నిర్వహించాలని చెప్పారు. కార్మికులు తమ బాధ్యతల పట్ల అప్రమత్తంగా, లౌక్యంగా పనిచేసుకుంటూ ముందు సాగాలన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ భూషన్ ప్రసాద్ సింగ్, మేడం భూషన్ ప్రసాద్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, హైదరాబాద్ రీజియన్-1 ఉమేష్ మధుకర్ రావు సావర్కర్ , పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున డి. లక్ష్మీకాంతం డైరెక్టర్ (టెక్నికల్), టి.శ్రీధర్ రెడ్డి ప్రెసిడెంట్ (ఆపరేషన్స్), పెన్నా సిమెంట్ గణేష్ పహాడ్ ప్లాంట్ హెడ్ మరియు ఎం.ఎస్&పి.ఎ. చైర్మన్ షేక్ మహబూబ్ బాషా, ఎం.ఎస్.&పి.ఎ సెక్రటరీ ఎం.రాంచందర్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గనులలో పనిచేసే వారంతా భద్రత పరికరాలను తప్పని సరిగా దరించి భద్రతతో కూడిన పనివిధానాన్ని అవలంబిస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారమే వుండదని తెలియజేశారు. ఇట్టి వార్షికోత్సవ కార్యక్రమములో సాంస్కృతిక కార్యక్రమములు, నృత్యాలు, పాటలతో అలరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల ఉద్యోగులు, కార్మికులందరికి జోనల్ మరియు రాష్ట్ర పరిధిలో బహుమతి ప్రదానం చేశారు. ఈ యొక్క కార్యక్రమములో అధికారులు, ఉద్యోగులు, వర్కర్స్ తదితరులు సుమారు 2,500 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేశారు.