మిర్యాలగూడ ప్రజాలహరి. హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాలను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు.తెలంగాణాలో 89 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత, ఇతర అంశాలపై రేషన్ డీలర్లతో మాట్లాడారు.
ప్రభుత్వాలు కిలో బియ్యానికి 39 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని మిల్లర్లు గాని ఇతరులు ఎవరైనా రీ సైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఈరోజు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ 56వేల కోట్ల అప్పుల్లో, 11వేల కోట్ల నష్టాల్లో ఉందని అన్నారు.
ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పోరేషన్ పై కేవలం వడ్డీ భారమే 3వేల కోట్లుందన్నారు.
రైస్ మిల్లర్ల దగ్గర 22వేల కోట్ల దాన్యం నిల్వలు గత ప్రభుత్వం పెట్టడంపై సమీక్ష జరుపుతున్నామన్నారు.*
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేపడుతున్న ధాన్యం సేకరణ పద్దతులను, రేషన్ వ్యవస్థను మరింత మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అన్నారు.