ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలి 6 గ్యారంటీలను అమలుకు కృషి చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధి కోసం పని చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
ప్రజాలహరి హైదరాబాద్..
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రస్థాయి కలెక్టర్లు ఎస్పీ ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అందరూ స్వేచ్ఛగా తమ విధులను నిర్వహించుకోవచ్చు ని అభివృద్ధికి మార్గదర్శకం ఉండాలని కోరారు. అవినీతి, భూకబ్జాలు, సహించేది లేదని అటువంటి వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అదేవిధంగా అధికారులు కూడా అవినీతి భూకబ్జాలు అవినీతిపరులను వదిలిపెట్టవద్దని వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామాలలో ప్రజా పాలన పేరిట సభలు నిర్వహించాలని ప్రజలు ఇచ్చే వినతులను రికార్డ్ వైస్ గా భద్రపరచాలని సూచనలు చేశారు. వాటి పరిష్కారాన్ని కూడా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వెనువెంటనే పరిష్కరించాలని సూచనలు చేశారు .అదేవిధంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారి ని ఏర్పాటు చేస్తున్నట్లు త ద్వారా ప్రజావాణిలో విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఆరుగారెంటీలో పథకాల అమలుకు అధికారులు సూచనలు చేయాలని పూర్తిస్థాయిలో పథకాల అమలు కు అధికారులు సహకరించాలని చెప్పారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఒకవేళ ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటే బాధ్యత నుంచి తప్పుకోవచ్చని పిలుపునిచ్చారు. అదే విధంగా తెలంగాణలో డ్రగ్స్ ప్రభావం ఎక్కువ ఉందని డ్రగ్స్ అనేది లేకుండా చేయాలని అందుకు బాధ్యులైన పై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూ కబ్జాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా నకిలీ విత్తనాలు రైతుని నట్టేట ముంచేదని అటువంటి చర్యలకు పాల్పడుతున్న అమ్మక దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర్ రాజనర్సింహ, ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు