Ultimate magazine theme for WordPress.

ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

Post top
home side top

*ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్*

*ప్రజాస్వామ్యనికి చీకటి రోజులు*

*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి*         ప్రజా


లహరి మిర్యాలగూడ      కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లోక్ సభ ,రాజ్యసభలో పార్లమెంటు సభ్యులను 146 మందిని సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ ఈ రోజు మిర్యాలగూడ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో వారు పాల్గొని ప్రసంగిస్తూ పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతులను నొక్కే విదంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యనికి చీకటి రోజులని వారు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో బిజెపి ఎంపీ ఇచ్చిన పాసులతో పార్లమెంటులోకి జొరబడి పొగ బాంబు లేసి దేశం మొత్తం విస్తుపోయేవిదంగా ఘటన జరిగిందని, .దీన్ని వ్యతిరేకిస్తూ దీనిపైన సమగ్ర విచారణ జరపాలని పార్లమెంటు భవనానికి భద్రత లేదు. భద్రత వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని,భద్రత కల్పించాలని ఇండియా కూటమి సభ్యులు కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీల సభ్యులు ప్రశ్నించినందుకు రాజ్యసభలో పార్లమెంటు లోక్ సభలో నుండి ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించడం అన్యాయం. ఎవరైతే పార్లమెంటులోకి పోవడానికి అనుమతి ఇచ్చి పాసులు ఇచ్చి పంపించారో వారిపై ఎ లాంటి చర్యలు లేవు .బిజెపి ఎంపీ పాసులు ఇచ్చారు. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవాలి. అతన్ని సస్పెండ్ చేయాలి .అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. కానీ ఈ పార్లమెంటు భద్రతకు ముప్పు వాటిలో చేసిన వ్యక్తిని వదిలిపెట్టి ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడానికి సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. భద్రత గురించి రాజ్యం గురించి గొప్ప గొప్ప దేశభక్తి గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, హోం మినిస్టర్ అమిత్ షా గాని కనీసం భద్రాతపై నోరుమేదుప లేదు . .వారి తప్పును తప్పని అన్నందుకు సస్పెండ్ చేస్తారా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇది నియంతృత్వం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, మల్లు గౌతమరెడ్డి, బావండ్ల పాండు, రెమడాల పరుశురాములు, వరలక్ష్మి,తిరుపతి రామూర్తి, నాయకులు పగిడోజు రామూర్తి, పిల్లుట్ల సైదులు, ప్రమీల, అరుణ, పూలమ్మ, దేశిరామ్, రామకృష్ణ, వెంకన్న, కోడిరెక్క మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.