Ultimate magazine theme for WordPress.

శివాని స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ పట్టణం సంతోష్ నగర్ నందు గల శివాని హై స్కూల్ లో జాతీయ గణిత శాస్త్ర దినం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ గారు ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్న స్థాయి నుండి అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచేలా మెళుకువలు నేర్చుకోవాలని అలాగే విద్యతోపాటు సమాజములో వచ్చే రుగ్మతలను ఎలా ఎదుర్కోవాలో ఇటువంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.. సైన్స్ ఫెయిర్ సందర్భంగా విద్యార్థిని , విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను తిలకించి మెరుగైన నైపుణ్యం కనబరిచిన వారిని అభినందించారు.. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీర కోటి రెడ్డి,దామరచర్ల ZPTC అంగోతు లలిత హతిరాం నాయక్, పెద్ద కోటి రెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల యాజమాన్యం కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, కుందూరు శ్రీనివాసరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు , విద్యార్థులు తదితరులు ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.