80 వేల కోట్ల అప్పుల ఊబిలో విద్యుత్ శాఖ పై స్వేత పత్రం విడుదల చేసిన భట్టి విక్రమార్క. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లు ఛత్తీస్గడ్ విద్యుత్ ఒప్పందం పై జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
80 వేల కోట్లు అప్పులలో కినెట్టిన గత ప్రభుత్వం….విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క….. ప్రజాలహరి హైదరాబాద్… చతిస్గడ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి ,భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలతో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టిన గత ప్రభుత్వం క్షమించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో విద్యుత్ శాఖ పై స్వేత పత్రం విడుదల చేశారు. విద్యుత్తు వినియోగం నష్టం లాభాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది గత ప్రభుత్వాన్ని విమర్శించే సాగుగా తప్పులతరకగా పెట్టిన శ్వేత పత్రాన్ని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి ,భద్రాద్రి పవర్ ప్లాంట్ లు,చిత్తీస్గడ్ ఒప్పందాలపై జ్యూడిషల్ విచారణ వేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు. తప్పులు చేసిన వారు ఈ ఎంక్వయిరీ నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు మధ్యలో నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ ,జగదీష్ రెడ్డి ల మధ్యమాటలు యుద్ధం కొనసాగింది పరస్పర నిందారోపణలు చేసుకుంటూ సభను కొనసాగించారు