మిర్యాలగూడ ప్రజాలహరి… దామరచర్ల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో హాజరైన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్న గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని అదేవిధంగా జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం పని చేయాలన్నారు. సాగర్ ఆయకట్టు కింద యాసంగి పంటకు ఆరుతడి నీళ్లు విడుదల చేయాలని సాగర్లో నీళ్లు లేకపోతే కర్ణాటక ప్రాజెక్టు ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేసే ప్రయత్నాలు చేయాలని లేనిపక్షంలో సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు నష్టం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీల సభ్యులను సుమారు 22 మందిని ఏకపక్ష ధోరణిలో సస్పెండ్ చేయడాన్ని నిరసన రేపు ఇండియా కూటమి పిలుపులో భాగంగా జిల్లాలోని అన్ని మండల పట్టణ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు జరుపుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, పార్టీ మండల కార్యదర్శి వినోద్ నాయక్,సైదులు సీనియర్ నాయకులు పాపా నాయక్ ,ఎర్ర నాయక్, కోటిరెడ్డి, ఖాజా, దయానంద్, సుభాని, కరీం మునిసా తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.