ఉపరాష్ట్రపతి నీ అవమానిస్తూ కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బిజెపి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన
పార్లమెంట్ భవన మెట్లపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ దనఖడ్ ను హాస్య ప్రదర్శన, అవమానం చేస్తూ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, కుహనావాదులు దేశ ప్రతిష్ట ను అవమాన కరంగా చూపిస్తున్న రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఇండియా కూటమి ని తీవ్రంగా కండిస్తూ, బీజేపీ కేంద్ర,రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం లో భాగంగా నేడు మిర్యాలగూడ బస్టాండ్ ముందు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ హటావో దేష్ కీ బచావో అంటూ నినాదాలు ఇస్తూ నిరసన చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అవినీతి, స్కాములు లేకుండా భారతదేశాన్ని అత్యున్నత స్థానం లో నిలిపిన దేశ ప్రధానిని, బిజెపి ప్రభుత్వం ను అబాసూపాలు చేయాలనీ కుట్రతో, ఐటీ అధికారుల దాడిలో 550 కోట్ల రూపాయలు దొరికిన దిరాజ్ సాహు విషయాన్నీ పార్లమెంట్ లో చర్చించకుండా దేశ ప్రజలను ప్రక్కదారి పట్టించాలనే ఉద్దేశ్యం తో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రగా ప్రజలందరూ గ్రహించాలని ఎలాంటి ఉగ్రదాడులు లేకుండా దేశం కోసం దర్మం కోసం పనిచేసే మోదీ ప్రభుత్వం ను మరొక్క సారి బలపరిచి దేశ అభివృద్ధి కి సహకరించాలని ఈ సందర్బంగా కోరారు ఈ కార్యక్రమం లో పట్టణ ప్రధాన చిలుకూరి శ్యామ్ జిల్లా ఉపాధ్యక్షలు రేపాల పురుషోత్తం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కనపర్తి సత్యప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చల్లమల సీతారామ్ రెడ్డి, యాదగిరి రెడ్డి, మూల రాజిరెడ్డి, యాదమ్మ,జవ్వాజి సత్యనారాయణ, సైదులు, కంచుకోమ్ముల వేణు, రవి, రాంప్రసాద్, బీజేవైఎం చిల్లంచర్ల అభి, భరత్ లు పాల్గొన్నారు